బండి భగీరథ్ కు హైకోర్టు షాక్

ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కు హైకోర్టులో బిగ్ షాక్ త‌గిలింది. కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమ‌ని హైకోర్టు తేల్చి చెప్పింది.

ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కు హైకోర్టులో బిగ్ షాక్ త‌గిలింది. కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమ‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని భగీరథ్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చి మోసం చేశారని బాధితురాలు ఆరోపించినందునా… ఇది చీటింగ్ కేసు అవుతుందే తప్పా..ఇందులో పోక్సో కేసు ఎఫెక్ట్ కాదు అని వాదించారు. నేను పిటిషన్ క్వాష్ చేయమని అడగటం లేదు.. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని అడుగుతున్నానని నివేదించారు.

మీరు ఇంటీరిమ్ బెయిల్ ఇస్తే భగీరథ్ విచారణకు హాజరవుతారు.. పూర్తిగా సహకరిస్తారని కోర్టుకు వివరించారు. బాధితురాలి తరఫున లాయర్ నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. బాధితురాలు మైనర్‌ అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. బాధితురాలి పుట్టిన రోజు 12 ఆగస్టు,2008 అని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ కోర్టుకు నివేదించగా..పీపీ వాదనలతో కోర్టు ఏకీభవించింది.

అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో భగీరథ్ ను అరెస్ట చేయకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి తుది తీర్పును మే 21వ తేదీకి వాయిదా వేసింది తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. బండి భగీరథ్ పై మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

నానాటికీ తగ్గిపోతున్న అసెంబ్లీ సమావేశాలు..
సంక్షేమ పథకాల అమలుపై ‘సర్’ దెబ్బ

Latest News