Site icon vidhaatha

Warangal: బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి.. కాజీపేటలో దిష్టిబొమ్మ దహనం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Snjay) చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు, టిఆర్ఎస్(TRS) పార్టీ హనుమకొండ(Hanumakonda) జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhaskar) డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం కాజీపేట జంక్షన్ వద్ద ధర్నా చేసి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సంద‌ర్భంగా చీఫ్ విప్ గారు మాట్లాడుతూ ఈ రోజుల్లో రౌడీలు, గుండాలు కుడా వాడనటువంటి బాష వాడడం సిగ్గు చేటు అని అన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు సంస్థలను చెప్పు చేతల్లో పెట్టుకుని బీఆర్ ఎస్ నేతలను టార్గెట్ చేస్తోందని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ కవితకు చట్టాలపై గౌరవం ఉందని, అందుకే విచారణకు హాజరయ్యారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు. ఇప్పుడు మహిళ అయిన ఎమ్మెల్సీ కవితపై విచారణ ముమ్మాటికీ కక్ష సాధింపు చర్య అని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version