క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త చేయ‌డంలో విఫ‌ల‌మైన బీజేపీ

రైతు పండించిన పంట‌కు కనీస మద్దతు ధర కు చట్టబద్దత చేయడంలో బీజేపీ విఫలమైంద‌ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఇంచార్జ్ అఖిలేష్ శుక్లా అన్నారు

  • Publish Date - April 16, 2024 / 09:24 PM IST

తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఇంచార్జ్ అఖిలేష్ శుక్లా
విధాత‌: రైతు పండించిన పంట‌కు కనీస మద్దతు ధర కు చట్టబద్దత చేయడంలో బీజేపీ విఫలమైంద‌ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఇంచార్జ్ అఖిలేష్ శుక్లా అన్నారు. మంగ‌ళ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో తెలంగాణ కిసాన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్య‌క్షత‌న‌ కిసాన్ కాంగ్రెస్ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఇంచార్జ్ అఖిలేష్ శుక్లా, జాతీయ ఉపాధ్య‌క్షులు కోదండ రెడ్డి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అఖిలేష్ శుక్లా మాట్లాడుతూ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ రైతు వ్య‌తిరేక విధానాల‌ను,పాల‌సీల‌ను గ్రామ‌గ్రామాన రైతులకు వివరించాలని చెప్పారు. బీజేపీ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయకపోవడం వలన ఎకరానికి 15,818 రూపాయలు రైతులు నష్టపోయారని లెక్క‌ల‌తో స‌హా వివ‌రించారు. బీజేపీ స‌ర్కారు రైతులకు పైసా కూడా రుణమాఫీ చేయలేదు కానీ పారిశ్రామిక వేత్తలకు మాత్రం లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిందన్నారు.
తెలంగాణాలో బీజేపీ శక్తులను ఓడించడంలో కిసాన్ కాంగ్రెస్ పార్లమెంట్ వారీగా ఇంచార్జ్ ల‌ను నియ‌మించి గ్రామా గ్రామాన రైతులను చైతన్యం చేయాలని సూచించారు.

Latest News