పదేళ్లలో తెలంగాణకు బిజెపి అన్యాయం

పదేండ్లలో బీజేపీ తెలంగాణకు చేసిందేమి లేదని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం

  • Publish Date - April 21, 2024 / 08:47 PM IST

 అధికారంలో ఉండి అభివృద్ధిలో నిర్లక్ష్యం

  • బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్

విధాత, వరంగల్ ప్రతినిధి: పదేండ్లలో బీజేపీ తెలంగాణకు చేసిందేమి లేదని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వర్దన్నపేట ముఖ్యల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ బిజెపి ప్రభుత్వం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కాజిపేట్ – కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీ కన్వెన్షన్ హాల్ నందు 23 తేదీన సాయంత్రం వర్దన్నపేట కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరుకానున్నారని వివరించారు. 22న బీఆరెస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు.వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గస్థాయి మీటింగ్ లకు సైతం కేటీఆర్ హాజరు అవుతారని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులనే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు బీ ఫార్మ్ ఇచ్చి పోటీలో ఉంచారన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు
భారత రాష్ట్ర సమితి వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ 23 వ తేదిన జరిగే వర్ధన్నపేట నియోజక వర్గ స్థాయి కార్యకర్త ల సమావేశానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హాజరవుతారు కావున కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఓ భూ కబ్జాదారు అని ఆరోపించారు. ఆరూరి రమేష్ ను వర్ధన్నపేట నియోజక వర్గ ఎమ్మెల్యే గా గెలిపిస్తే నియోజక వర్గం చుట్టూ భూములు ఆక్రమించారని అన్నారు.
రేపు ఎంపీ గా గెలిపిస్తే పార్లమెంట్ చుట్టూ భూములు అక్రమిస్తాడు అని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం బయ్యారం ఉక్కు కర్మాగారం ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాని కి కేంద్ర ప్రభుత్వం ఒక్క వైద్య కళాశాల మంజూరు చేయలేదని తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ కుడా చైర్మన్లు సుందర్ రాజ్ యాదవ్, మర్రి యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News