Site icon vidhaatha

వైభ‌వం ఉట్టిప‌డేలా బోనాలు

కొవిడ్‌ నిబంధనలు అనుసరించి భక్తులకు ఏర్పాట్లు
బోనాల నిర్వ‌హ‌ణ‌పై మంత్రులు అల్లోల, త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ స‌మీక్ష‌

విధాత : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభ‌వంగా నిర్వ‌హించేలా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు ఇంద్ర‌ క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌ముద్ అలీ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్, హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ… అధికారులతో అర‌ణ్య భ‌వ‌న్ లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… బోనాల‌కు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆల‌యాల వ‌ద్ద‌ క్యూలైన్లు, నీటి సౌకర్యం క‌ల్పించాల‌న్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి దర్శనాలు చేసుకోవాలని కోరారు. ఆల‌యాల వ‌ద్ద కూడా మాస్కుల‌ను, శానిటైజ‌ర్ల్ ఉండేలా చూడాల‌ని తెలిపారు.

బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు. 15 కోట్ల రూపాయలు మంజూరు చేశార‌ని ఆ నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకుని బోనాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌న్నారు. ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌, అలంకర‌ణ‌, పూజ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే నిధుల‌ను స‌కాలంలో ఆల‌య క‌మిటీల‌కు మంజూరు చేయాల‌న్నారు. అమ్మవారి ఆలయాల‌ను సుందరంగా తీర్చిదిద్దాల‌ని, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించాల‌ని తెలిపారు. సాంస్కృతిక శాఖ ఆద్వ‌ర్యంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని చెప్పారు. ఆల‌యాలో పాటు జంట న‌గ‌రాల్లోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌ను విద్యుత్ దీపాలతో అలంకరించాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ్వేతా మహంతి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు అభిప్రాయపడింది. రాష్ట్ర అ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి , వివిధ శాఖ అధిపతులు పాల్గొన్నారు. ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపైన ఇప్పటికే పలుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు మరోసారి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో భూముల విలువను సవరించేందుకు ఉన్న అవకాశాల పైన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సబ్ కమిటీ విస్తృతంగా చర్చించింది.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తూ వస్తున్నదని, దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున విలువ పెరిగిన విషయం సబ్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది.

ఇలా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భారీగా భూముల విలువ పెరిగినా, గత ఎనిమిది సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో ఏలాంటి పెంపు చేయలేదు. ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్న చాలామంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి లావాదేవీల వలన సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Exit mobile version