Site icon vidhaatha

BRS | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు బీఆరెస్‌ ఫిర్యాదు

విధాత, హైదరాబాద్‌: బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆరెస్ పార్టీ బుధవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.

స్పీకర్‌ను నేరుగా కలిసేందుకు అపాయింట్‌మెంట్ దాటవేస్తుండటంతో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈమెయిల్‌, స్పీడ్ పోస్టుల ద్వారా తమ ఫిర్యాదు స్పీకర్‌కు పంపించారు. పోచారం, సంజయ్‌లతో పాటు బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలపైన కూడా అనర్హత వేటు వేయాలని జగదీశ్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కోన్నారు.

Exit mobile version