జిల్లా సమస్యలపై వినతి
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ జిల్లా బీఆరెస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డి సోమవారం కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిహిన చల్లా వెంకట్రామ్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రాయచూర్ నుంచి శ్రీశైలం వరకు రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఆర్డీఎస్ కింద రిజర్వాయర్లు, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా చల్లా వెంకట్రామ్‌రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం వినిపిస్తున్న క్రమంలో ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలువడం ఆసక్తిరేపింది.