Site icon vidhaatha

KTR | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అల్లర్లు.. మెదక్ పరిణామాలపై కేటీఆర్ ట్వీట్

విధాత, హైదరాబాద్ : తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అల్లర్లు నెలకొన్నాయంటూ మెదక్ ఘర్షణలపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెదక్ లో చోటు చేసుకున్నఅలర్లపై ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. గడిచిన తొమ్మిదినరేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలాంటి మత పరమైన ఘర్షణలో లేకుండా ప్రశాంతంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు.

గతంలో ఎన్నడూ మతపరమైన కార్యకలాపాలు లేని ప్రశాంతమైన మెదక్ పట్టణం ఇప్పుడు అల్లర్లతో అస్తవ్యస్తంగా మారడం నిజంగా సిగ్గుచేటన్నారు. కాగా మెదక్ పట్టణంలో ఆదివారం బీజేపీ బంద్ ప్రశాంతంగా సాగింది. వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పట్టణంలో పోలీసుశాఖ అదనపు బలగాలను మోహరించి శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు చేపట్టింది. ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామిలు అక్కడే ఉండి స్వయంగా భద్రతను పర్యవేక్షించారు.

Exit mobile version