Site icon vidhaatha

KTR | చరిత్ర పునరావృతమవుతుంది.. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్

అసెంబ్లీలో 33కు పడిపోయిన బీఆరెస్ బలం..70కి పెరిగిన కాంగ్రెస్

విధాత : బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేల వలసలపై ట్వీటర్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చరిత్ర పునరావృతం అవుతుందంటూ కేటీఆర్ పార్టీ ఫిరాయింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నవారికంటే ప్రజల శక్తి ఎప్పడూ బలంగా ఉంటుందని చెప్పారు. 2004-06 మధ్య కూడా తమ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయని, ప్రజాఉద్యమం ఉధృతంతో తెలంగాణ గట్టిగా స్పందించిందని చెప్పారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తలవంచక తప్పలేదనిన్నారు. చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందంటూ పార్టీ ఫిరాయింపులపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. అయితే కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో 2014, 2018లో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆరెస్‌లో చేర్చుకున్న అంశం ఎందుకు మరిచిపోయారంటూ కేటీఆర్‌కు కౌంటర్ వేస్తున్నారు. కాగా 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ 39 ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకోగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణంతో ఉప ఎన్నికల్లో ఆ స్థానం కాంగ్రెస్‌కు కోల్పోయింది. మిగిలిన 38మందిలో దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్‌లు బీఆరెస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64సీట్లు గెలిస్తే, మిత్రపక్షం సీపీఐ ఒక సీటు గెలిచింది. బీఆరెస్ ఎమ్మెల్యేలు ఐదుగురి చేరికతో పాటు గెలిచిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానంతో కలిపి ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 70కి పెరిగింది. బీఆరెస్ బలం 39నుంచి 33కు పడిపోయింది.

Exit mobile version