విధాత, హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం జనాన్ని భయాందోళనలకు గురి చేస్తుంది. ఆదివారం ఉదయం కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో చిరుత దాడిలో దూడ మృతి చెందింది. గ్రామానికి చెందిన దడిగే లక్ష్మీనర్సు అనే రైతుకు చెందిన బర్రె దూడెను సత్యనారాయణపల్లెలోని తన పొలం వద్ద రోజు మాదిరిగానే కట్టేశాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూసేసరికి చిరుత దాడిలో మృతి చెందింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ జంతువు తిరిగిన చోటును పరిశీలించారు. చిరుత కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
చిరుత పులి దాడిలో దూడ మృతి
