Site icon vidhaatha

Greater Warangal: ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముగింపు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్, కలెక్టర్లు కార్పొరేటర్లతో కలిసి చేసిన దాండియా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బల్దియాలోని మహిళలు, వారి పిల్లలు చేసిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ మహిళల‌ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళల కోసం మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు 18 రకాల హెల్త్ టెస్టులు నిర్వహించడం పట్ల, రూ.750 కోట్ల‌ రుణం మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మెప్మా మహిళలచే తయారు చేసిన చెలీ నాప్కిన్, డూప్స్టిక్ మెప్మా ద్వారా వస్తువులను కేంద్రంలోని ఢిల్లీలో ప్రదర్శిస్తామని అన్నారు.

వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మహిళలు తలచుకొంటే సాధించనిది ఏమి లేదని, పట్టణ ప్రగతి టాయిలెట్స్ ఎ స్.హెచ్ జి మహిళల సంఘాలు సమర్ధంగా నిర్వహిస్తున్నారని అన్నారు. వివిధ రంగాల్లో కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మహిళలు కార్పొరేటర్లు, అధికారులు పెద్దసంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version