Site icon vidhaatha

CM Revanth Reddy | సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు వరదాయినీ సీతారామ ప్రాజెక్టు(Sitarama project)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌(Second pump house of Sitarama project)ను స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. అదేవిధంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద సీతారామ పంప్ హౌజ్-1ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ములకపల్లి మండలం కమలాపురం 3వ పంప్ హౌజ్-30 రాష్ట్ర డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎన్‌. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కింద సుమారరు 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3.45 లక్షల ఎకరాల ఇప్పటికే వాడుకలో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందనుంది.

 

Exit mobile version