అలాంటి మృగాళ్లకు శిక్ష తప్పదన్న మంత్రి సీతక్క
విధాత, హైదరాబాద్ : ఫన్ పేరుతో తండ్రీకూతుళ్ల బంధంపై ఏపీకి చెందిన యూ ట్యూబర్‌తో పాటు మరికొందరు యూట్యూబర్లు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్‌గా మారడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న హీరో సాయిధరమ్ తేజ్ అభ్యర్థనపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు స్పందించారు. యూ ట్యూబర్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వారి ఆదేశాలతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై తప్పు తెలుసుకున్న యూ ట్యూబర్లు సైతం క్షమాపణలు చెప్పినప్పటికి చట్టపరంగా కేసుల్లో ఇరుక్కున్నారు.
అలాంటి మృగాళ్లకు శిక్ష తప్పదు..
తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కొంత మంది నీచులు వక్రీకరించడం దారుణం.
సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయిన దుర్మార్గులపై కేసు నమోదు చేశాం.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.
సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై కొంతమంది అసభ్యకర వ్యాఖ్యలు… pic.twitter.com/1uS5ZmjscZ— BIG TV Breaking News (@bigtvtelugu) July 8, 2024
అలాంటి మృగాళ్లకు శిక్ష తప్పదు : మంత్రి సీతక్క తండ్రి కూతుళ్ల బంధాన్ని వక్రీకరించడంపై మంత్రి సీతక్క మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయిన దుర్మార్గులపై కేసు నమోదు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై కొంతమంది అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనను ఖండించారు.
Thank you for bringing to our notice this issue @IamSaiDharamTej garu.
Child safety is utmost priority for our Govt. Will look into this incident and take appropriate action. https://t.co/5fTG4ZiQYi
— Revanth Reddy (@revanth_anumula) July 7, 2024