ప్రజల చేతిలో అత్యంత విలువైన ఓటు అనే వజ్రాయుధం: సీఎం కేసీఆర్

  • Publish Date - November 7, 2023 / 11:19 AM IST

  • తమాషాగా ఓటేస్తే బతుకులు తమాషా అవుతాయి
  • సింగరేణి పాలన చేతగాక అప్పుల పాలు చేసింది
  • సింగరేణి కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం తాకట్టు పెట్టిన కాంగ్రెస్.
  • దేశంలో ఓటర్లలో పూర్తిస్థాయి పరిణితి రాలేదు
  • పదేళ్ల కాలంలో టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉంది
  • ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్


విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: ఓట్లు వేయాలని అందరూ వస్తారని ఆగం ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు హక్కులు వినియోగించుకోవాలని మీ ఓటు అనే వజ్రాయుధం మీ తలరాతని మార్చుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు


మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అభ్యర్థి గుణం మంచి చెడు ఆలోచించి అభ్యర్థి నియమించిన పార్టీ నడవడిక స్పష్టమైన అవగాహన అలవర్చుకొని ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.


గెలిచిన ఎమ్మెల్యేలతోని ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఏ ప్రభుత్వం అయితే ప్రజల బాగోగులు పట్టించుకుంటుందో ఆ పార్టీకి ఓటేయాలని , ముసుగులు వేసుకుని సూట్ కేసులు పట్టుకొని పార్టీలు మారే వ్యక్తులకు ఓట్లు వేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని పేర్కొన్నారు.


కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు ఏళ్ళు గెలిచి పరిపాలించిందని దాని చరిత్ర ఏందో మీకు తెలుసా అని , కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో బాస్ ఉంటారని అక్కడ బాస్ ఎలా చెప్తే ఇక్కడ అలా నడుస్తుందని కాని బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే బాసులని ప్రజల అభిమతం మేరకే తెలంగాణలో పరిపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు.


కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ మీ కళ్ళ ముందే కనబడుతుందని తమాషాగా నాలుగు రూపాయలకు ఓటు వేయకూడదని అన్నారు. 15 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేశామని ఆ అభివృద్ధి మీ కళ్ళముందే కనబడుతుందని పేర్కొన్నారు.


తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని కలిపింది కాంగ్రెస్ పార్టీని ఆ రోజు గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ అనే ఉద్యమం మొదలు అయిందని ఆ ఉద్యమంలో ఏడుగురు విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపిందని పేర్కొన్నారు.


తెలంగాణ రాక ముందు అప్పుల తెలంగాణ కరెంటు, సాగునీరు తాగునీరు లేక ప్రజల అనేక ఇబ్బందులు పడేవారు అని 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఆరిగోసపడ్డామని తెలిపారు. చేనేత కార్మికులు రైతులు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.


సింగరేణి కంపెనీ తెలంగాణ కే కొంగు బంగారమని 134 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సింగరేణిలో 10 బిలియన్ టన్నుల బొగ్గు ఉందని పేర్కొన్నారు. సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టీ అని సింగరేణి నడిపించలేక అప్పుల పాలు చేసి అప్పులు కట్టలేక కేంద్ర ప్రభుత్వానికి 49 శాతాన్ని కట్టబెట్టిందని అన్నారు.


కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టియుసి, సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ లు సింగరేణి కార్మికులకు ఉన్న డిపెండెంట్ హక్కును పోగొట్టిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 419 కోట్లు లాభాలు రాగా నేడు 21 84 కోట్ల లాభాలు సింగరేణికి వస్తున్నాయని అందులో నుండి 1000 కోట్లు కార్మికులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.


కాంగ్రెస్ పార్టీ హయాంలో 18 శాతం లాభాల వాటా ఇస్తే మనం ఇప్పుడు 32 శాతానికి లాభాలను కార్మికులకు ఇవ్వగా ప్రతి కార్మికునికి రెండున్నర లక్షల రూపాయలు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు . కాంగ్రెస్ హయాంలో సింగరేణిలో 10400 ఉద్యోగాలు ఇస్తే మా పదేళ్ల కాలంలో 19400 ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు.


 



సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు సొంత గృహాలు నిర్మించుకొనుటకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు తెలంగాణ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో ప్రజలకు అలానే సంక్షేమ పథకాల యొక్క స్వరూపాన్ని పెంచుతూ వస్తున్నామని అన్నారు.


సాగునీటి వనరులు పెంచడం మూలంగా నేడు తెలంగాణలో నాలుగు కోట్ల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు

రాబోయే కాలంలో ప్రతి రేషన్ కార్డు పై సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.


ఎంతో కష్టపడి తెలంగాణ ప్రభుత్వం రైతు భూములు దళారుల బరిన పడకుండా ధరణి పోర్టల్ తీసుకువస్తే దాన్ని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నాయకులు ఉత్తంకుమార్ రెడ్డి అన్నారని ధరణి పోర్టలను బంగాళాఖాతంలో వెయ్యాలా అని ప్రజలను ప్రశ్నించారు.


ధరణి తీసివేస్తే దళారుల రాజ్యం ఏర్పడుతుందని పైరవీరుకారుల చుట్టూ తిరిగాల్సి వస్తుందని అన్నారు ఇవాళ రైతుబంధు ధరణి మూలంగానే ఎవరికి సంబంధం లేకుండా బ్యాంకులో డబ్బులు వేస్తున్నామని అన్నారు.


టిపిసిసి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు మూడు గంటల కరెంటు చాలని మాట్లాడుతున్నాడని తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుందని 24 గంటల ఉచిత కరెంటు కావాలా మూడు గంటలు కావాలా మీరే నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు.


సింగరేణి ఏరియాలో ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్న కార్మికులకు కార్మికేతర్లకు 40 నుండి 45 వేల పట్టాలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ జపం చేస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.


మంచిర్యాల జిల్లాలో అన్నదమ్ములు డబ్బులు సంచులు పట్టుకొని వచ్చారని వారికి ఓటు వేస్తే మీకు భవిష్యత్తు ఉండదని డబ్బు సంచులకు ఓటు వేస్తారా బాల్క సుమన్ కి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు . మరొక ఆయన పేకాట క్లబ్బులు నడుపుకుంటూ ఎన్నో కుటుంబాలను కూలగొట్టి ఇవాళ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారని గెలిస్తే అందిన కాడికి దోచుకుంటున్నానని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో మంచిర్యాల బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్ రావు దుర్గం చిన్నయ్య ఎమ్మెల్సీ దండే విటల్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు వెంకటరావు మిర్యాల రాజిరెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Latest News