Site icon vidhaatha

CM Revanth Reddy | అసమానతలపై పోరాటం రాహుల్ వ్యక్తిత్వం

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

విధాత : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదినం పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటం అతని వ్యక్తిత్వమని పేర్కొన్నారు. వెనుకబడిన వారికి అండగా ఉండాలనేది ఆయన దృక్పథమన్నారు. త్యాగం, వారసత్వం, పోరాటం ఆయన తత్వమని రేవంత్‌రెడ్డి పేర్కోన్నారు. రాహుల్‌ తెలివైనవాడని.. భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడని రేవంత్‌రెడ్డి కొనియాడారు. జన్మదినం సందర్భంగా రాహుల్‌గాంధీకి సామాజిక మాద్యమాల వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

దేశానికి భవిష్యత్ సారధి రాహుల్‌గాంధీ: డిప్యూటీ సీఎం భట్టి

భవిష్యత్తులో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహిస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. బుధవారం గాంధీ భవన్‌లో రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం ప్రారంభించారు. కోమటిరెడ్డి రక్తదానం చేశారు.

అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. దేశంలో జనాభా దామాషా ప్రకారం జనగణన జరగాలని, దేశ జనాభాకు అనుగుణంగా సంపద పంచాలనేది రాహుల్ ఆలోచన అన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇది నా దేశమని గర్వంగా తలెత్తుకునేలా చేయాలన్నది రాహుల్ లక్ష్యమని తెలిపారు. ఉమ్మడి కుటుంబం మాదిరిగా జాతి నిర్మాణం జరగాలని, అందుకు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Exit mobile version