కేసీఆర్ గవర్నర్.. కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి..కవితకు బెయిల్
ఢిల్లీలో సీఎం మీడియా చిట్ చాట్
CM Revanth Reddy | బీజేపీ(BJP)లో బీఆరెస్ (BRS) విలీనం ఖాయమని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా చిట్ చాట్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో బీఆరెస్ విలీనంపై స్పందించారు. బీజేపీలో బీఆరెస్ విలీనమవుతుందని, కేసీఆర్ (KCR)కు గవర్నర్ పదవి, కేటీఆర్ (KTR) కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పారు.
హరీష్ రావు (Harish Rao) అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియామితులవుతారని, కవిత (Kavitha)కు బెయిల్ కూడా వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్‌కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారని, బీజేపీలో బీఆరెస్ విలీనంతో కవితకు రాజ్యసభ సభ్యత్వం కూడా వస్తుందన్నారు. గతంలో సైతం సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలో విలీనం కోసం బీఆరెస్ నేతలు ఢిల్లీలో చీకటి ఒప్పందం చేసుకున్నారంటూ ఆరోపించడం విదితమే.