Site icon vidhaatha

CPI Narayana | 400 సీట్లు ప్రచారంతో బీజేపీ మైండ్ గేమ్‌: సీపీఐ నారాయణ

మోదీ ప్రభుత్వం పతనం ఖాయం

విధాత: బీజేపీకి 400సీట్లు వస్తాయన్న ప్రచారంతో ఆ పార్టీ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ గాలివీస్తుందని బీజేపీ చెబుతున్న మాటలకు..క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచలనకు పొంతన లేదన్నారు. నిజానికి ఇప్పటిదాకా జరిగిన నాలుగు విడతల పోలింగ్ సరళీ చూస్తే మోదీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టమైందని, ఆ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమని నారాయణ జోస్యం చెప్పారు. ఉత్తర భారతదేశంలోనూ ఎన్డీఏ కూటమికి భారీగా సీట్లు తగ్గనున్నాయని చెప్పారు.

మెజార్టీ సీట్లు రావని, ఇండియా కూటమి పుంజుకున్నదని గ్రహించిన మోదీ ప్రజల భావోద్వేగాలను, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పార్టీలను అణిచివేసే క్రమంలోనే ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌పైన, ఆప్ నేతలపై అక్రమ అరెస్టులు జరిపిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసు కూడా బీజేపీ కుట్రలోంచే పుట్టుకొచ్చిందని, మోదీని ప్రశ్నించినందుకే కేసీఆర్ కూతురు కవితను లిక్కర్ కేసులో ఇరికించారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటమితో మోదీ ప్రభుత్వం పతనం తథ్యమన్నారు.

Exit mobile version