Site icon vidhaatha

CPI Narayana | సంగీతంలో ప్రాంతీయ భేదం అనవసరం : సీపీఐ నారాయణ

రాష్ట్ర చిహ్నం జోలికెళ్లకపోవడమే మంచిది
సీపీఐ నారాయణ హితవు

విధాత, హైదరాబాద్‌ : సంగీతంలో ప్రాంతీయ భేదాన్ని తీసుకురావడం మంచిది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రా గీతానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు కీరవాణికి అప్పగించడంపై బీఆరెస్‌ పార్టీ ప్రాంతీయ వాదాన్ని తీసుకురావడం సరికాదన్నారు. గత బీఆరెస్‌ ప్రభుత్వంలో 12 మంది సమైక్యవాదులను మంత్రులుగా పెట్టుకున్న సంగతి మరువరాదని విమర్శించారు.

తెలంగాణ గీతం రూపొందించడం అభినందనీయమన్నారు. అలాగే రాష్ట్ర చిహ్నం మార్పుపై స్పందిస్తూ ప్రస్తుతం రాష్ట్ర చిహ్నం జోలికెళ్లడం మంచిదికాదని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. మోదీ ధ్యానం చేయడం.. కన్యాకుమారిని కలుషితం చేయడమేనన్నారు. కేంద్రంలో మోదీ రాకపోతే.. చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని కోరుకుంటానని చెప్పారు.

Exit mobile version