Site icon vidhaatha

సిపిఐ పోడు యాత్ర

విధాత:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొడు భూముల సమస్యలు పరిష్కరించాలంటూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లోని జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు పోడు యాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోడు భూముల చట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని చట్టాలు అమలు అవుతున్న లేద అని చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అడవి భూములు హక్కుల చట్టం ప్రకారం అర్హులైన రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తానని ఇవ్వలేదని కనీసం సాగుచేస్తున్న భూములను దళితులకు గిరిజనులకు ఇవ్వాలని పోడు భూములు సాగు చేస్తున్న రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళుతెరచి భూములు సాగు చేస్తున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version