Site icon vidhaatha

దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది: కేసీఆర్

విధాత,హుజురాబాద్: హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరికాసేపట్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శాలపల్లిలో నిర్వహించే దళిత బంధు ప్రారంభోత్సవ సభకు సీఎం చేరుకున్నారు. జై భీమ్‌ అంటూ కేసీఆర్‌ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దళితబంధు పథకంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. రైతుబంధు పథకంతో తెలంగాణ రైతుల్లో ధీమా పెరిగిందని, రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ సాధనలో తొలి నుంచి కరీంనగర్ జిల్లా ముందుందన్న కేసీఆర్‌ దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది మహా ఉద్యమమని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల దళితబంధు ఆలస్యమైందని, దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలంగాణ సాకారమైనట్లే దళితుల అభివృద్ధి కూడా జరగాలని కోరారు.

Exit mobile version