విధాత,హైదరాబాద్ : రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం. రూ.25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్. తొలిరోజు 1309 మంది రైతుల ఖా తాలకు రుణమాఫీ నిధుల బదిలీ. మొత్తం రూ.3 కోట్ల 27 ల క్షల 91 వేల 186 ఖాతాల లో జమ. ఈ నెల 30 వరకు కొన సాగనున్న ప్రక్రియ. రూ. 50 వేల రూపాయల లోపు గల రై తుల రుణాలన్నీ మాఫీ. రైతు బంధు నిధుల పంపిణీ మాది రిగానే రుణమాఫీ నిధులు కూ డా జమ అవుతాయి. రైతుల ఖాతాలలో జమయిన నిధుల ను బ్యాంకర్లు ఇతర పద్దుల కిం ద జమ చేసుకోవద్దు. రుణాలు మాఫీ అయిన రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు అంద జేయాలి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
మన అడుగుతో అన్ని రాష్ట్రాల్లో అగ్గి రాజుకుంటుంది: సీఎం కేసీఆర్
హుజూరాబాద్‌లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీ ఆర్ అన్నారు. ‘ఇది ఒక సువర్ణ అవకాశం. మన నిర్ణయంతో భారత దళిత జాతి మేల్కొంటుంది. ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి రగులుకుంటుంది. పిడికెలిత్తి అడుగుతది. దళిత బిడ్డలకు లాభం జరుగుతది. ప్రపంచ వ్యా ప్తంగా ఈ ఉ ద్యమానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మీరు చాలా బాధ్యతగా హుజూరాబాద్‌లో విజయవంతం చేసి చూపి పెట్టాలె. ఈ పథకం అమలులో అనుమానాలు అవసరం లే దు. అందరికీ, ప్రతి కుటుంబానికి వస్తది. తెలంగాణ ఉద్యమం లో పెద్ద పెద్ద రా కాసులతో పోరాటం చేశాను. పెట్టుబడిదా రులకు వ్యతిరేకంగా పోరాటం చేశాను. మీలో చాలా మంది పాత్రధారులే. లక్షా 70 వేల కోట్లు అయితది సమస్యనే కాదు. కానే కాదు. గవర్న మెంట్ పట్టుపట్టిన తర్వాత వంద శాతం విజయం సాధిస్తాం.’ అని కేసీఆర్ అన్నారు.
‘17 లక్షల కుటుంబాలకు ఇచ్చిన ఒక లక్ష్యం రూ.70 వేల కోట్లు. సంవత్సరానికి 30 వేల 40 వేల కోట్లు ఖర్చుపెడితే మూడేండ్లలో దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాయి. దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాయన్న గోరెటి వెంకన్న కలనెరవేరాలి. లడాయి గాళ్ల తోటి ఏ పని కాదు. కిరికిరి గాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు. 20 రోజుల తర్వాత నేనే హుజూరాబాద్ వచ్చి కొన్ని మండలాలు తిరుగుతాను.’ అని సీఎం చెప్పారు.