డిస్కవరీ ఛానల్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై డాక్యుమెంటరీ

విధాత‌:హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపు 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో అతి పెద్దదయిన ఎత్తిపోతల పథకమని చెప్పవచ్చు. అత్యంత భారీ తనంతో రూపొందిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై డిస్కవరి ఛానల్ ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందింది. ఈ డాక్యుమెంటరీని ఈ […]

  • Publish Date - June 21, 2021 / 06:43 AM IST

విధాత‌:హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపు 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో అతి పెద్దదయిన ఎత్తిపోతల పథకమని చెప్పవచ్చు. అత్యంత భారీ తనంతో రూపొందిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై డిస్కవరి ఛానల్ ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందింది. ఈ డాక్యుమెంటరీని ఈ నెల 25వ తేదీన డిస్కవరీ ఛానల్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబోతోంది.

kaleshwaram
లిఫ్టింగ్‌ ఎ రివర్‌పేరుతో గంటపాటు ప్రసారం కానున్న ఈ డాక్యుమెంటరీ శుక్రవారం రాత్రి 8 గంటలకు రానుంది. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నదిలో నీరు పారే దిశకు వ్యతిరేక దిశలో వందల కిలోమీటర్ల మేర నీటిని ఎత్తిపోసి, పలు చోట్ల రిర్వాయర్లలో నీటిని నిల్వ చేసి, అక్కడి నుంచి పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును 2017లో ప్రారంభించారు. అప్పటి నుంచి మొదలు ఇప్పటివరకు జరిగిన పనులను చూపుతూనే, ఈ ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను డిస్కవరీ ఛానల్ లో ప్రసారం అయ్యే ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్లు చూపనున్నారు.

ఇంగ్లిష్‌, హిందీ సహా ఆరు భారతీయ భాషల్లో ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ట్వీట్టర్ ద్వార ప్రకటించింది. కామారెడ్డి పర్యటన సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టుపై డిస్కవరీ ఛానల్ లో డాక్యుమెంటరీ ప్రసారం అవుతుందని తెలిపారు.

Readmore:ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటన ఖరారు

Latest News