విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో బుధవారం ఈడీ సోదాలు చేపట్టింది. 300 కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్‌పై కేసు నేపథ్యంలో తనిఖీలు చేపట్టింది. అనర్హులకి రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై ఈడి విచారణ కొనసాగిస్తుంది. హైదరాబాద్ నగర పోలీసుల కేసు ఆధారంగావిచారణ చేపట్టిన ఈడీ హైదరాబాదులోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మహేష్ బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్ తోపాటు సీఈవో డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు చేపట్టింది. సోలిపురం వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పిల్లలు, సోదరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తుంది. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్టుగా ఈడీ గుర్తించింది.
Mahesh Cooperative Bank | మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈడీ సోదాలు…300కోట్ల గోల్‌మాల్ కేసులో విచారణ
