Site icon vidhaatha

ప్రముఖ చిత్రకారుడు చంద్ర కన్నుమూత

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ధాటికి మరో ప్రముఖుడు తుది శ్వాస విడిచారు. ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర (74) కరోనాతో కన్నుమూశారు. గత మూడేళ్లుగా నరాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న చంద్రను కరోనా మహమ్మారి బలి తీసుకుంది.

సికింద్రాబాద్‌లోని మదర్‌ థెరిసా రీహాబిటేషన్‌ సెంటర్‌లో కరోనాతో చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. చంద్ర పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌ శ్రీనగర్‌ కాలనీలోని నివాసానికి తరలించారు.

Exit mobile version