Site icon vidhaatha

TELANGANA | రాష్ట్రంలో ఐదు కొత్త ప్రైవేట్‌ యూనివర్సిటీలు : న్యాయ శాఖ గెజిట్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ మాజీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ జులైలో ఆమోదించిన ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లుతో రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్‌ యూనివర్సిటీలు అందుబాటులోకి రానున్నాయి. గవర్నర్ సంతకం నేపథ్యంలో న్యాయశాఖ కార్యదర్శి గెజిట్ విడుదల చేశారు. ఉన్నత విద్యాశాఖ జీఓ విడుదలకు సిద్ధమైంది. వాటి ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం ప్రైవేట్‌ యూనివర్శిటీల సంఖ్య 10కి పెరుగనుంది. కొత్తగా అందుబాటులోకి రానున్న ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో శ్రీనిధి(ఘట్ కేసర్), గురునానక్ (ఇబ్రహీంపట్నం), ఎంఎన్‌ఆర్‌ (సంగారెడ్డి), కావేరీ (వర్గల్), నిక్మార్ (శామీర్ పేట) విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

Exit mobile version