Site icon vidhaatha

Gaddar | గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి

Gaddar | విధాత : ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మాణానికి మంగళవారం హెచ్‌ఎండీఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ నెల 31న గద్దర్ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఇటీవల తెల్లాపూర్లో అఖిలపక్షం నాయకులు గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకోగా, పలు సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ఈ వివాదంపై స్పందించిన ప్రభుత్వం గద్దర్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతినిచ్చింది.

Exit mobile version