విధాత : మొక్కజోన్న రైతుల కష్టాలు కనిపించడం లేదా.. పదేపదే మీకు గుర్తు చేయాలా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి టి.హరీష్ రావు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా అలసత్వం వీడి అప్రమత్తతతో ఉండాలంటూ హరీష్ రావు లేఖలో సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. క్వింటాల్‌కు రూ. 2400 దక్కాల్సిన మక్కలకు రూ. 1600 కే కొనడం అన్యాయం అన్నారు. రైతులను దళారులు దోచుకుంటుంటే మీకు సంతోషమా? అని ప్రశ్నించారు.
మీ ఢిల్లీ టూర్లు, సెటిల్మెంట్లు, సొంత పనులు పక్కనబెట్టి అన్నదాతల ఆవేదన వినండి అని డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటు మీరు ఇస్తామన్న రూ. 330 బోనస్ ఇవ్వాల్సిందేనని, తక్షణమే రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళనలు చేపడతాం అని హరీష్ రావు హెచ్చరించారు.