Site icon vidhaatha

ఇస్తామన్న ప్రోత్సాహకాలూ పెండింగ్‌…బీఆరెస్ వల్లే పరిశ్రమల మూత!

మధ్యతరహా పరిశ్రమలకు భారీగా బకాయిలు
ఇస్తామన్న ప్రోత్సాహకాలూ పెండింగ్‌

హైదరాబాద్‌: కొత్త పారిశ్రామిక విధానం పేరిట హడావుడి చేసిన గత ప్రభుత్వం చిన్న మధ్యతరహా పరిశ్రమలకు భారీగా బకాయి పడిందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇస్తామని చెప్పిన ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడంతో చాలా పరిశ్రమలు మూత పడ్డాయని పేర్కొంటున్నాయి. మే 20వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సహకాలు దాదాపు రూ.3736 కోట్లు బకాయి ఉన్నట్టు తెలుస్తున్నది.

వీటిలో రూ.3007 కోట్లు చిన్న మధ్య పరిశ్రమలకు సంబంధించినవి కాగా, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవని అధికారవర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. కానీ పరిశ్రమలకు నిధులు విడుదల చేయలేదని ఆ వర్గాలు అంటున్నాయి. గత ఏడాది 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చిన రూ.684 కోట్ల విలువైన చెక్కులు కూడా ల్యాప్స్‌ అయ్యాయని సమాచారం. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్తగా పాలసీని తయారు చేస్తోందని అధికారులు తెలిపారు.

Exit mobile version