Site icon vidhaatha

Heavy rains | రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..!

Heavy rains : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్‌ ఉందన్నారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి.

పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత రెండు రోజుల నుంచి ఎండలు విపరీతంగా ఉండడంతో ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బంది పడ్డారు. శుక్రవారం సాయంత్రం వర్షంపడటంతో వాతావరణం చల్లబడింది.

ఇక వర్షం కురవడంతో నగర వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, బంజారాహిల్స్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ, గుండ్ల పోచంపల్లి, బహదూర్‌పల్లి, పేట్‌ బషీరాబాద్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, సూరారంతో పాటు సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, బేగంపేట్, సనత్‌నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Exit mobile version