Site icon vidhaatha

Heavy Rains | తెలంగాణ‌లో రేపు, ఎల్లుండి భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ..!

Heavy Rains | వాయుగుండం ప్ర‌భావంతో తెలంగాణ‌లో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. దీంతో ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ హెచ్చ‌రిక‌ల‌ను వాతావ‌ర‌ణ శాఖ జారీ చేసింది.

ఈ నెల 9వ తేదీన కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు, ఆదిలాబాద్, నిర్మ‌ల్, పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

10వ తేదీన కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు, గంట‌కు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంది. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది.

Exit mobile version