Site icon vidhaatha

యాదాద్రిలో పోటెత్తిన భక్తజనం

విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తుల రద్దీతో పోటెత్తింది. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో కొండ కింద.. కొండపైన ఆలయ పరిసరాలు, మాడవీధులు కిక్కిరి సాయి. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తజనం స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్ల లో బారులు తీరారు. దేవస్థానం తరపున ఎండల వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు పక్కా షెడ్లతో పాటు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కొండపై భక్తులకు ఎండ వేడి నుంచి కొంత ఊరట లభించింది. స్వామివారి దర్శనానికి భక్తులు మూడు గంటలపాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.

Exit mobile version