విధాత:మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని ఒంటరి మహిళలు,పురుషులకు పూర్తి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని అప్పటి వరకు వారి ఇండ్లను కూల్చకూడదని స్పెషల్ హరిత డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ.
- ఒంటరి మహిళలకు న్యాయం చేయాలంటూ కోర్టుకు వెళ్లిన పలువురు వేములఘాట్, ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులు.
- కేసులలో పిటిషనర్లను తమ తమ ఆధార్ కార్డులను తీసుకొని కలెక్టర్ ముందు హాజరయి ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ తీసుకోవాలని హైకోర్ట్ సూచన.
- పిటిషనర్లలో ఎవరు లేని వారికి చెక్కులు సిద్ధంగా ఉన్నాయని వారికి చెక్కులు ఇచ్చేస్తామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం.
- కేసుకు సంబంధించి జులై 9 న వ్రాత పూర్వకంగా ప్రభుత్వం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం.