Site icon vidhaatha

గన్‌మెన్‌పై మహమూద్ అలీ ప్రతాపం.. పబ్లిక్‌లో చెంప చెల్లుమనిపించిన మంత్రి

కట్టుతప్పుతున్న మంత్రుల కోపం


విధాత : రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్ చెంపపై కొట్టడం వివాదస్పమైంది. మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో పూల బొకే ఎక్కడ అంటూ మహమూద్ అలీ తన గన్‌మెన్ చెంప పై కొట్టారు. పాపం ఊహించని ఘటనతో ఆ గన్‌మెన్ బిత్తరపోగా, తలసాని పోనిలేండి అంటూ సర్ధి చెప్పారు.

సాధారణంగా ఎప్పుడు శాంత స్వభావుడిగా కనిపించే మహమూద్ అలీ ఇలా ఆగ్రహంతో వ్యవహారించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇటీవలే మంత్రి తలసాని స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా సొంత పార్టీ గిరిజన నేతపై చేయి చేసుకోవడం నిరసనలకు దారితీసింది.



తాజాగా అభివృద్ధి పనుల కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి సొంత పార్టీ ఎమ్మెల్యే తలపై కొట్టడం వివాదస్పదమైంది. మంత్రుల దురుసు వైఖరులకు సంబంధించిన సదరు ఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నికల వేళ మంత్రుల ఆగ్రహం అదుపు తప్పుతుండటం పార్టీని ఇరకాటంలో పెట్టేలా ఉందని, వారు హుందాగా వ్యవహారించాలని కేడర్ అభిప్రాయపడుతుంది.

Exit mobile version