విధాత: డ్రైనేజీలో పడుతున్న సంఘటనలు హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా యాకుత్పురాలోని పాత బస్తీలో ఓపెన్ డ్రెయిన్లో ఆరేళ్ల చిన్నారి పడిపోయిన ఘటన సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది. తల్లితో పాటు కలిసి వెళుతున్న చిన్నారి తెరిచి ఉంచిన డ్రెయిన్లో పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తల్లి బాలికను బయటకు తీసింది. దీంతో ప్రమాదం తప్పింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
VIDEO: డ్రైనేజీలో పడిపోయిన బాలిక
