Site icon vidhaatha

ఆ మూడు రోజులు వర్షాలు.. తెలంగాణకు ఐఎండీ చల్లని కబురు..

విధాత, హైదరాబాద్‌: సూర్య ప్రతాపంతో పెరిగిన వేసవి ఎండల ధాటికి తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈనెల 7,8,9తేదీల్లో తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

ఆదివారం నుంచి మంగళవారం వరకు వర్ష ప్రభావం ఉంటుందని, ఏప్రిల్ 7, 8తేదీల్లో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వర్షాలు పడనున్నాయని, 9వ తేదీన కామారెడ్డిలో వర్షం పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ పరిధిలో మాత్రం వర్షాలు పడే అవకాశం లేదని పేర్కోంది.

Exit mobile version