Hyderabad metro station bullet| హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం

హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఓ యువకుడి బ్యాగ్ లో బుల్లెట్ లభ్యమవ్వడం కలకలం రేపింది. బీహార్ కు చెందిన మహమ్మద్ అనే యువకుడు వద్ధ 9ఎంఎం పిస్టల్ బుల్లెట్ లభించింది.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో స్టేషన్(Hyderabad metro station)  వద్ద ఓ యువకుడి(Young men) బ్యాగ్ లో బుల్లెట్(bullet) లభ్యమవ్వడం కలకలం రేపింది. మూసాపేట్-ప్రగతినగర్‌లో ఉంటూ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్న మహమ్మద్ అనే యువకుడు వద్ధ 9ఎంఎం పిస్టల్ బుల్లెట్ లభించింది. అతని స్వస్థలం బీహార్ గా గుర్తించారు. శనివారం రాత్రి ఓ బ్యాగ్‌తో మూసాపేట్ మెట్రో స్టేషన్‌కు వచ్చిన మహమ్మద్ ను మెట్రో సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా చెక్ చేశారు.

మహమ్మద్ వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు తనిఖీల్లో బీప్ శబ్దం ద్వారా గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అతడి బ్యాగ్ ను పూర్తిగాపరిశీలించగా.. మహమ్మద్ వద్ద 9 ఎంఎం బుల్లెట్ దొరికింది. ఈ ఘటనపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.