హోం ఐసోలేష‌న్ కిట్లు కావాలా..

విధాత‌(హైద‌రాబాద్) : హైద‌రాబాద్ ప‌రిధిలో క‌రోనా నియంత్ర‌ణ‌కు జీహెచ్ఎంసీ అధికారులు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు క‌రోనా పాజిటివ్ బాధితుల‌కు హోం ఐసోలేష‌న్ కిట్లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ల‌క్ష హోం ఐసోలేష‌న్ కిట్ల‌ను జీహెచ్ఎంసీ కొనుగోలు చేసింది. జీహెచ్ఎంసీ జోన్లు, స‌ర్కిళ్ల వారీగా హోం ఐసోలేష‌న్ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో కంట్రోల్ రూం […]

  • Publish Date - May 6, 2021 / 09:05 AM IST

విధాత‌(హైద‌రాబాద్) : హైద‌రాబాద్ ప‌రిధిలో క‌రోనా నియంత్ర‌ణ‌కు జీహెచ్ఎంసీ అధికారులు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు క‌రోనా పాజిటివ్ బాధితుల‌కు హోం ఐసోలేష‌న్ కిట్లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ల‌క్ష హోం ఐసోలేష‌న్ కిట్ల‌ను జీహెచ్ఎంసీ కొనుగోలు చేసింది. జీహెచ్ఎంసీ జోన్లు, స‌ర్కిళ్ల వారీగా హోం ఐసోలేష‌న్ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. హోం ఐసోలేష‌న్ కిట్ల కోసం క‌రోనా పాజిటివ్ బాధితులు సంప్ర‌దించాల్సిన ఫోన్ నంబ‌ర్ 040 – 2111 1111.

Latest News