Site icon vidhaatha

టీజీయూజీసెట్ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పెంపు

తెలంగాణ గురుకులం అండ‌ర్‌గ్రాడ్యుయేట్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌(టీజీయూజీసెట్‌) ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ గ‌డువు తేదీ పొడిగింప‌బ‌డింది. మే 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల గ‌డువు తేదీ పొడిగింప‌బడింది. 2021-22 ఏడాదిగాను బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ ఫ‌స్టియ‌ర్ యూజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు తెలంగాణ సోష‌ల్ అండ్ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ డిగ్రీ కాలేజీలు విద్యార్థిని, విద్యార్థుల నుండి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. మరిన్ని వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం విద్యార్థులు టీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్ వెబ్‌సైట్ www.tswreis.in ని సందర్శించవచ్చు.

Exit mobile version