Woman Bike Ride | ఈ ఇంటర్నెట్ యుగంలో రోజుకో కొత్త సంఘటన వెలుగు చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఓ మహిళ బైక్ రైడింగ్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అదేదో స్కూటీ కాదు.. స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అది. మరి ప్యాంట్, టీషర్టు ధరించి బైక్ నడిపిందా.. అంటే లేదు. ఏకంగా చీర ధరించి.. మాంచి రొమాంటిక్‌గా రైడ్ చేసుకుంటూ దూసుకెళ్లింది. ఆ మగువ రైడ్‌కు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. మగువ బైక్ రైడ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
స్పోర్ట్స్ బైక్‌ను రైడ్ చేసిన ఆ మహిళా ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. పిస్తా కలర్‌లో ఉన్న చీర ధరించింది. గాజులు కూడా పిస్తా కలర్‌వే వేసుకుంది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం తలకు హెల్మెట్ కూడా పెట్టుకుంది. ఇక తన నాజుకైన నడుమును చూపిస్తూ పిస్తా శారీలో ఆమె మెరిసిపోయింది. తన ఒంపుసొంపులతో బైక్ రైడ్ చేస్తుంటే కుర్రాళ్ల గుండెలు ఆగిపోయినంత పనైంది.
ఇక ఆ స్పోర్ట్స్ బైక్ తెలంగాణ రాష్ట్రం పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది. నంబర్ ప్లేట్‌ను పరిశీలిస్తే టీఎస్ 03 అని రాసి ఉంది. టీఎస్ 03 సీరిస్ వరంగల్ ఆర్టీవో పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఆ మహిళా వరంగల్ జిల్లాకు చెందిన ఆమె అయి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే తన బైక్ రైడింగ్ వీడియోను జెట్టి బైక్ గర్ల్ అనే ఇన్‌స్టా ఖాతాలో ఆమెనే స్వయంగా పోస్టు చేశారు. ఈ ఒక్క వీడియోనే కాదు.. బైక్ రైడింగ్ వీడియోలు చాలానే ఉన్నాయి. కాకపోతే చీర కట్టులో బైక్ రైడ్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.