నెటిజన్ ట్వీట్‌కు జై.ప్రజాతీర్పుకు నై..కేటీఆర్ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ ఓటమిపై ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌పై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రీట్వీట్‌తో స్పందించిన తీరు సోషల్ మీడియా వేదిగా రచ్చ రేపుతుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ ఓటమిపై ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌పై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రీట్వీట్‌తో స్పందించిన తీరు సోషల్ మీడియా వేదిగా రచ్చ రేపుతుంది. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉంటే ప్రత్యర్థుల తప్పుడు ప్రచారం తిప్పికొట్టేవాళ్లం అని ఓ నెటిజన్‌ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పలువురు పలు విధాలుగా స్పందనలు, విశ్లేషణలు చేస్తున్నారని తన ట్విట్‌లో పేర్కోన్నారు.




ఫలితాలపై స్పందనగా ఓ నెటిజన్ మెడికల్ కళాశాలల బదులుగా కేసీఆర్‌ య్యూటూబ్ చానెల్స్ పెడితే బాగుండేదేమో అంటూ చేసిన ట్వీట్‌తో తాను ఏకీభవిస్తున్నట్లుగా రీట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ ట్వీట్‌ను తప్పుబడుతున్న మరికొందరు నెటిజన్లు అసలు ఎన్నికల సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగాను, అధికార పార్టీగాను ఉన్న అవకాశాలతో ప్రచార, ప్రసార మాద్యమాల్లోనూ అతిగా ప్రచారం చేసుకున్నదెవరంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే ప్రజాతీర్పును సరిగా అవగతం చేసుకోవడంలో కేటీఆర్ సహా బీఆరెస్ నేతలు ఇంకా సరైన దృక్పథాన్ని ప్రదర్శించం లేదంటు చురకలేస్తున్నారు.




చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా జరిగిన తెలంగాణ ప్రజల స్వేచ్చా హరణం గూర్చి, నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలన గూర్చి, ఎమ్మెల్యేలపైన వ్యతిరేకతను గూర్చి బీఆరెస్ నేతలు ఎన్నికల ఫలితాలతో భేరీజు వేసుకోలేపోతున్నారన్న విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ప్రభుత్వంపైన, సిటింగ్‌లపైన నెలకొన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ లాభపడిందన్న వాస్తవాన్ని కాంగ్రెస్‌-బీఆరెస్‌ల మధ్య ఓటింగ్ శాతం తేడాలతో బీఆరెస్ సారధులు అంగీకరించలేకపోతున్నారని, పాలనా మార్పు కోరుకున్న ప్రజాతీర్పును స్వాగతించకలేపోతున్నారన్న విమర్శలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి

Latest News