Site icon vidhaatha

కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ వినయ్ కృష్ణా

విధాత, నల్గొండ: ప్రజాకవి కాళోజీ నారాయణ రావు తన రచనల ద్వారా ఎందరికో స్ఫూర్తి నింపారని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో కాళోజీ చిత్రపటానికినికి, పూల మాలవేసి నివాళులర్పించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యపరిచే విధంగా కాళోజీ గారు అనేక రచనలు చేసారని, తెలంగాణ భాషయాసనును వ్యాప్తి చెందే విధంగా ఆయన రచనలు ఉండేవని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కాళోజీ గారి రచనలు ఎంతో దోహదపడ్డాయని, ఆయన స్పూర్తితో ఆయన జన్మదినం నాడు తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిద్వనిగా కాళోజి గారిని కొనియాడతారని, రాజకీయ చైతన్యాల సమాహారమని అన్నారు. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని నినదించిన కాళోజీ జీవితం అంతా తెలంగాణ బాషా సాహితీ సేవ దిశగా సాగిందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డి.అర్.డి. ఓ. కాళిందిని,గృహ నిర్మాణ శాఖ పి.డి.రాజ్ కుమార్,మత్స్య శాఖ అధికారి వెంకయ్య,డి.ఎస్. ఓ.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో మోతీ లాల్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Exit mobile version