Site icon vidhaatha

రాజ‌కీయ వికృత క్రీడ‌కు కార‌ణం రేవంత్ రెడ్డే : కేసీఆర్

ఇవాళ రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ వికృత క్రీడ‌కు సీఎం రేవంత్ రెడ్డే కార‌ణం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఆయ‌న వెనుకాల ఉన్న ముఠా కూడా రాజ‌కీయ వికృత క్రీడ‌కు కార‌ణ‌మ‌ని చెప్పారు. నాకు తెలిసి ఒక అజ్ఞాన‌, అహంకార‌పూరితమైన‌టువంటి వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ ప‌రిపాల‌న చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తామ‌ని సీఎం శాస‌న‌స‌భ‌లో మాట్లాడారు. ఇది సాధ్య‌మేనా..? ఆ ఆలోచ‌ననే ఎంత వికృతం..? కాంగ్రెస్ ప‌దేండ్లు అధికారంలో లేదు. పోయిందా..? టైమ్ కోసం వెయిట్ చేస్తారు. ప్ర‌జ‌ల ఆలోచ‌న స‌ర‌ళి మార్చిన‌ప్పుడు మార్పు జ‌రుగుతుంది. కానీ కృత్రిమంగా వికృతంగా చేసే ఆరోప‌ణ‌లు, ప్ర‌య‌త్నాలు బెడిసికొడుతాయి. చ‌రిత్ర‌లో స‌క్సెస్ కావు అని కేసీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ దాడిని లెక్క‌లోకి తీసుకోను. అవ‌స‌రం లేదు. ఇందిరా అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిరా అనే స్థాయికి ఎదిగారు. ఎమ‌ర్జెన్సీ విధించిన త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికి తెలుసు. ఒక భావ‌జాలం పుడితే జ‌న‌తా పార్టీ జైళ్ల‌లో నుంచి పుట్టింది. 70 రోజుల్లో కేంద్రంలో అధికారం చేప‌ట్టారు. కాబ‌ట్టి అలా అనుకోవ‌డానికి లేదు. కేసీఆర్ ఒక ఇన్‌స్టిట్యూష‌న్, ఒక ప‌ర్స‌న్ కాదు. శూన్యంలో నుంచి సునామీ పుట్టించాను. మా బ‌తుకులు ఇంతేనా అని స్వ‌యంగా ఒక పార్టీ స్థాపించి, ఉద్య‌మ రూపంలో న‌డిపి ల‌క్ష్యాన్ని సాధించాం. ప‌దేండ్లు ఏ వివ‌క్ష లేకుండా ప‌రిపాలించాం. రాజ‌కీయ నాయ‌కులు కొన్ని విష‌యాల‌ను ప్ర‌బ‌లంగా తీసుకుపోవ‌డానికి ఉద్వేగం, వ్యంగ్యంతో మాట్లాడుతారు. స‌మైక్య‌వాదుల దాడికి కొంచెం వ్యంగ్యం మాట్లాడాను. దాంతో వ్య‌తిరేకం అనుకున్నారు. కానీ నేను ఎవ‌రికీ వ్య‌తిరేకం కాదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Exit mobile version