Site icon vidhaatha

హుజూరాబాద్‌పై కేసీఆర్‌ అంతు లేని ప్రేమ ప్రదర్శన… విజయశాంతి ఎద్దేవా

విధాత:ఉపఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌పై సీఎం కేసీఆర్‌ అంతులేనిప్రేమ ప్రదర్శిస్తున్నారని బీజేపీ నాయకురాలు,మాజీ ఎంపీ విజయశాంతి సోమవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.ప్రభుత్వయంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరూ ఈ నియోజకవర్గంలోనే మకాం వేసి వరాలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు.దళితుడిని సీఎం చేస్తానని,దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్‌ వాగ్దానాలు చేసి మరిచారన్నారు.దళిత ఉప ముఖ్యమంత్రులకు దక్కిన మర్యాద మనం చూశామని,అలాగే ‘దళితబంధు’ కూడా ప్రకటనలకే పరిమితమవుతుందేమోన్న అనుమానం వ్యక్తం చేశారు.

Exit mobile version