ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పూర్తి

విధాత,హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పూర్తైంది. విగ్రహ తయారీలో చివరి ఘట్టమైన కళ్లు అద్దకాన్ని కళాకారులు పూర్తి చేశారు. నేటి నుంచి ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వారంరోజుల ముందుగా ఖైరతాబాద్ గణేషుడు దర్శనం ఇస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా కేవలం 11 అడుగుల ఎత్తుకే పరిమితమైన ఈ గణపయ్యను ఈసారి భక్తుల కోరిక మేరకు 40 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు. ఓ వైపు కాలనాగేశ్వరి.. మరోవైపు కృష్ణ కాళిలు 11 […]

  • Publish Date - September 4, 2021 / 10:24 AM IST

విధాత,హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పూర్తైంది. విగ్రహ తయారీలో చివరి ఘట్టమైన కళ్లు అద్దకాన్ని కళాకారులు పూర్తి చేశారు. నేటి నుంచి ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వారంరోజుల ముందుగా ఖైరతాబాద్ గణేషుడు దర్శనం ఇస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా కేవలం 11 అడుగుల ఎత్తుకే పరిమితమైన ఈ గణపయ్యను ఈసారి భక్తుల కోరిక మేరకు 40 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు.

ఓ వైపు కాలనాగేశ్వరి.. మరోవైపు కృష్ణ కాళిలు 11 రోజుల పాటు ఓ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తలపించే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో విలసిల్లుతుంది. గణపతితో పాటు ఖైర తాబాద్‌లో ఇరువైపులా ప్రతియేటా దేవాతా మూర్తులను ఏ ర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తుతో కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. పుట్టల నడు మ భారీ నాగ దేవతపై కొలువుండే విధంగా కాల నాగేశ్వరి అ మ్మవారిని ప్రత్యేక సెటింగ్‌ల నడుమ తయారు చేస్తున్నారు. ఎడమ వైపున శ్రీకృష్ణుడిని ఆవహించిన కాళికా దేవి స్వరూపమైన కృష్ణకాళి రూపంలో మరో విగ్రహాన్ని తయారు చేస్తు న్నారు. భాగవతం సమయంలో శ్రీకృష్ణుడు కాళీ మాతను పూజించి అనుగ్రహించాలని కోరగా ఆమె శ్రీకృష్ణుడిపైనే ఆవ హించిన స్వరూపంగా కృష్ణకాళి ఉగ్ర స్వరూపంతో ఇక్కడ కొలువుతీరనుంది. ఆమె పక్కన కృష్ణుడి మాతృమూర్తి యశోదాదేవిసైతం భక్తులకు కనిపించనున్నారు.

Latest News