Site icon vidhaatha

KTR | రాష్ట్ర బడ్జెట్‌పై కేటీఆర్ కవితాత్మక విమర్శలు: కేటీఆర్

పసలేని.. దిశలేని.. దండగమారి బడ్జెట్ అని ట్వీట్‌

విధాత : రాష్ట్ర బడ్జెట్‌పై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కవితాత్మక శైలీలో యతిప్రాసలతో అల్లికతో కూడిన విమర్శలు గుప్పించారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..! అని, గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్ అని, వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్ అని విమర్శలు చేశారు. డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన…దోకేబాజ్ బడ్జెట్ అని, విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అని, రైతులకు కత్తిరింపులు.అన్నదాతలకు సున్నం అని, ఆడబిడ్డలకు అన్యాయం..మహాలక్ష్ములకు మహామోసమని పేర్కోన్నారు. అవ్వాతాతలకు..దివ్యాంగులకు.. నిరుపేదలకు…నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదన్నారు.

దళితులకు దగా..గిరిజనులకు మోసం అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలిందని, బడుగు..బలహీన వర్గాలకు భరోసాలేదు..వృత్తి కులాలపై కత్తికట్టారని విమర్శంచారు. మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..4 వేల భృతి జాడా పత్తా లేదని, విద్యార్థులపై కూడా వివక్షే..5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవని విమర్శించారు. నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు.. ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదన్నారు. మొత్తంగా పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్ అని కేటీఆర్ దుయ్యబట్టారు.

Exit mobile version