హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఆయనకు న్యూయార్క్‌లో గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు వరించింది. సుస్థిర పాలనలో కేటీఆర్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అయితే ఈ అవార్డును సెప్టెంబర్ 24న 9వ ఎన్‌వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరన్స్‌లో ప్రదానం చేయనున్నారు. కేటీఆర్ మున్సిపల్, ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో హరితహారం అభివృద్ధికి చేసిన కృషికి ప్రశంసలు అందుకున్నారు. 24 శాతం ఉన్న గ్రీనరీని 33 శాతానికి పెంచడంతో హైదరాబాద్ వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు, యూఎన్ గుర్తింపుతో హైదరాబాద్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.