హైదరాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కూకట్‌పల్లిలోని ఏటీఎం సిబ్బందిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లారు. పటేల్‌కుంట పార్కు సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సిబ్బంది వెళ్లారు. యంత్రంలో డబ్బులు నింపుతుండగా అల్వీన్ కాలనీవైపు నుంచి పల్సర్ వాహనంపై బ్యాంకు వద్దకు వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
ఇద్దరు ఏటీఎం సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డుపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం వారివద్ద ఉన్న రూ.5లక్షల డబ్బును దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ఏటీఎం సిబ్బంది అలీ బేగ్, శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు గాయపడిన వారిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అలీ బేగ్ మృతి చెందగా .. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిలో రెండు బుల్లెట్లు, బుల్లెట్ లాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా దొరికిన ఆధారాలతో పాటు సీసీ కెమెరాల ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. వేలిముద్ర నిపుణుల సాయంతో వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సొమ్ము దోచుకున్న అనంతరం దుండగులు భాగ్యనగర్ వైపు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.