Site icon vidhaatha

IFTU | కార్పొరేట్ దోపిడిదారులారా దేశం వదలండీ

వ్యవసాయ రంగాన్ని, కార్మిక చట్టాలను, దేశ సంపదను కాపాడుకుందాం.

క్విట్ ఇండియా స్ఫూర్తితో వరంగల్లో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

విధాత, వరంగల్ ప్రతినిధి : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం క్విట్ ఇండియా డే సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల జాతీయ సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో కార్మిక రైతు సంఘాల నాయకులు ధర్నా చేసి నిరసన తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం జరిగిన కార్యక్రమానికి ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగుల దయాకర్ అధ్యక్షత వహించగా రైతు కార్మిక సంఘాల నాయకులు ప్రసంగించారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2018 సంవత్సరం నుండి రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని ఫలితంగా వారు హక్కులు ఉపాధి కోల్పోతున్నారని వారు అన్నారు .దేశవ్యాప్తంగా జరిగిన రైతు, ఉద్యమానికి తలోగ్గి నాయకులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని వారు విమర్శించారు. 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లు గా మార్చి కార్మిక హక్కులను , హరించిందని ఈ దేశ బడా కార్పొరేట్ దోపిడీదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని వారు ఆరోపించారు.

వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నదని, విదేశీ కార్పొరేట్ శక్తులకు పన్ను రాయితీని ఇస్తున్నదని వారు మండిపడ్డారు.వ్యవసాయ పరిశోధనలకు అమెజాన్, సిన్జెంటా, బేయర్ లాంటి సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో , కార్మిక రైతు సంఘాల నాయకులు పెద్దారపు రమేష్, సోమిడి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు, గన్నారపు రమేష్, ముక్కెర రామస్వామి, నర్రా ప్రతాప్, గోనే కుమార స్వామి, సాగర్, దామెర కృష్ణ , బాబురావు, ఐలయ్య, ఎండి ఇస్మాయిల్, రవి యాదవ్, ఇనుముల శ్రీను, ఓదెల రాజయ్య, దామెర కృష్ణ, రాజనర్సయ్య, ఎండి యాకూబ్, బరపటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version