Site icon vidhaatha

IAS కాలేద‌ని విరక్తితో ఆత్మహత్య

విధాత‌: ఐఏఎస్‌(IAS) కావాలన్నది ఆయన జీవితాశయం. వయసు పెరిగిపోతుండటం..లక్ష్యం అందినట్టే అంది దూరమవుతుండటంతో జీవితంపై ఆశ చంపేసుకున్నారు. చివరికి బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్‌లోని వివేకానందనగర్‌ కాలనీ వాసి శ్రీనివాస్‌(42) పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఐఏఎస్‌ కావాలనే ఆశయంతో ఏళ్ల తరబడి దిల్లీలో ఉండి శిక్షణ తీసుకున్నారు. రెండుసార్లు ముఖాముఖి(interview) వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

ఇటీవల బంధువుల్లో ఒకరికి ఐఏఎస్‌ రావడంతో.. మరింత కుంగిపోయారు. ఇదే కారణంతో గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించడంతో బతికి బయటపడ్డారు. మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నిజామాబాద్‌ నాలుగో ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version