Site icon vidhaatha

గంగమ్మ ఒడికి బొజ్జ గణపయ్యలు.. మెదక్‌లో ఘనంగా శోభాయాత్ర

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం శోబా యాత్ర ఘనంగా కన్నుల పండువగా జరిగింది.రాందాస్ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్వర్యంలో స్వాగత వేదిక ఎర్పాటు చేశారు.ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఊరేగింపుగా వచ్చిన గణపతులకు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.



 



మహిళలతో కోలాటాలు అడి అందరినీ ఆకర్షించింది. డీజే సౌండ్ లతో గణపతి విగ్రహాల ముందు యువకులు డ్యాన్సులు నిర్వహించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అధ్వర్యంలో డిఎస్పీ అధ్వర్యంలో పట్టణంలో బారీ బందోబస్తు నిర్వహించారు.

కొంటూర్ చెరువులో.. నిమజ్జనం

మెదక్ మండలం కంటూర్ చెరువులో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను చేశారు .క్రేన్ సహాయంతో గణేష్ విగ్రహాల ను నిమజ్జనం చేశారు.పట్టణ,రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు వెంకటేష్,శేఖర్ రెడ్డి ల అధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.ఇంకా శనివారం తెల్లవారు జాము వరకు మొత్తం గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం పూర్తి కానుంది. 



 


Exit mobile version